పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, వెబ్ డెస్క్: దూర విద్యా విధానంలో 2020-21 విద్యాసంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబరు 31 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆచార్య సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ‘దూరవిద్యా కేంద్రం’ కోర్సుల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందడానికి వీలుగా ప్రత్యేక […]
దిశ, వెబ్ డెస్క్:
దూర విద్యా విధానంలో 2020-21 విద్యాసంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబరు 31 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆచార్య సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ‘దూరవిద్యా కేంద్రం’ కోర్సుల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందడానికి వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ నీతూకుమారి ప్రసాద్ మంగళవారం ప్రారంభించారని తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలుగువర్సిటీ వెబ్‌సైట్ www.teluguuniversity.ac.in లో సంప్రదించాలని కోరారు.