మాస్క్ ఉన్నా ఫోన్ అన్‌లాక్ !- ఐఫోన్ నయా అప్‌డేట్

కరోనా వైరస్‌ను.. ఇక రోజువారీ జీవితంలో భాగం చేసుకుని తగిన జాగ్రత్తలతో కాలం గడిపేందుకు మానవాళి సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా మాస్క్‌లు, శానిటైజర్లు, సామాజిక దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కొత్త అలవాట్లన్నీ సర్వసాధారణం కాబోతున్నాయి. ఈ క్రమంలో నిత్యజీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లు కూడా అప్‌డేట్ కావాలని ఆపిల్ సంస్థ భావించింది. అందుకే మాస్క్ ఉన్నప్పటికీ ఫేస్ ఐడీ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయగల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్ 13.5 అప్‌డేట్‌లో […]

Update: 2020-05-19 01:14 GMT

కరోనా వైరస్‌ను.. ఇక రోజువారీ జీవితంలో భాగం చేసుకుని తగిన జాగ్రత్తలతో కాలం గడిపేందుకు మానవాళి సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా మాస్క్‌లు, శానిటైజర్లు, సామాజిక దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కొత్త అలవాట్లన్నీ సర్వసాధారణం కాబోతున్నాయి. ఈ క్రమంలో నిత్యజీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లు కూడా అప్‌డేట్ కావాలని ఆపిల్ సంస్థ భావించింది. అందుకే మాస్క్ ఉన్నప్పటికీ ఫేస్ ఐడీ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయగల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఓఎస్ 13.5 అప్‌డేట్‌లో భాగంగా ఆపిల్ సోమవారం( మే 18న) ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత కరోనా సహిత జీవితంలో మాస్క్ మానవ శరీరంలో ఒక భాగంగా మారిన తరుణంలో ఫోన్ అన్‌లాక్ చేయడానికి మాస్క్ తీయడం వల్ల వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే ప్రతీసారి మాస్క్ తీయడం, పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఇలా మాస్క్ తీయకుండానే ఫోన్ అన్‌లాక్ చేయగల సౌకర్యాన్ని ఐఫోన్లలో ప్రవేశపెట్టింది. దీంతో పాటు ఆపిల్, గూగుల్ సంయుక్తంగా రూపొందించిన ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ ఏపీఐని కూడా ఆపిల్ ఈ అప్‌డేట్ ద్వారా ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టిన కరోనా సంబంధిత యాప్‌లకు ఈ ఏపీఐ ద్వారా స్మార్ట్‌ఫోన్ లింక్ అవుతుంది. దీని వల్ల కొవిడ్ 19 కాంటాక్టు ట్రేసింగ్‌ను చాలా సులభతరం చేసే అవకాశం కలుగుతుంది. అయితే ఈ ఏపీఐ వల్ల ఆరోగ్యసేతు యాప్ ఎలా ప్రభావితమవుతుందనే సంగతి ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News