చెన్నైలో తొలి దేశీయ యాపిల్ స్మార్ట్‌ఫోన్ తయారీ
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ యాపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్‌లో ఇదివరకటి కంటే తక్కువకే ఐఫోన్‌లు లభించనున్నాయి. ఇటీవల యాపిల్ చెన్నైలో ఉన్న తన ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్11 ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ట్విటర్ ద్వారా తెలిపారు. దేశీయంగా వీటి తయారీ ప్రయోజనకరంగా ఉండనుందన్నారు. ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియాలో ఇది కీలకమైన పురోగతి అని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి టాప్ ఆఫ్ ది […]
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ యాపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్‌లో ఇదివరకటి కంటే తక్కువకే ఐఫోన్‌లు లభించనున్నాయి. ఇటీవల యాపిల్ చెన్నైలో ఉన్న తన ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్11 ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ట్విటర్ ద్వారా తెలిపారు. దేశీయంగా వీటి తయారీ ప్రయోజనకరంగా ఉండనుందన్నారు. ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియాలో ఇది కీలకమైన పురోగతి అని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి టాప్ ఆఫ్ ది లైన్ మోడల్‌ను తీసుకొస్తున్నట్టు మంత్రి ట్వీట్‌లో తెలిపారు. మేక్ ఇన్ ఇండియాతో పోలిస్తే దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం పన్ను ఉంటుంది. ఈ కారణంగానే చెన్నైలో ఉత్పత్తి చేసే ఐఫోన్‌ల ధరలు తగ్గనున్నాయి. కాగా, బెంగళూరు సమీపంలో ఉన్న విస్ట్రాన్ ప్లాంట్‌లో ఐఫోన్ ఎస్ఈ-2020ని ఉత్పత్తి చేయాలని యాపిల్ భావిస్తోంది.