భారత్‌లో యాపిల్ రెట్టింపు వృద్ధి!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో యాపిల్ సంస్థ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసిందని టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఉత్పత్తులకు భారత మార్కెట్లో బలమైన డిమాండ్ చూశామని, భవిష్యత్తులో మరింత బలంగా పుంజుకుంటామని ఆశిస్తున్నట్టు ఆయన వివరించారు. ‘2020-21 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ సంస్థ భారత్, వియత్నాం దేశాల్లో రెట్టింపు వృద్ధి సాధించింది. ముఖ్యంగా యాపిల్ […]

Update: 2021-10-29 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో యాపిల్ సంస్థ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసిందని టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఉత్పత్తులకు భారత మార్కెట్లో బలమైన డిమాండ్ చూశామని, భవిష్యత్తులో మరింత బలంగా పుంజుకుంటామని ఆశిస్తున్నట్టు ఆయన వివరించారు. ‘2020-21 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ సంస్థ భారత్, వియత్నాం దేశాల్లో రెట్టింపు వృద్ధి సాధించింది. ముఖ్యంగా యాపిల్ నుంచి వస్తున్న కొత్త ఉత్పత్తులకు మెరుగైన గిరాకీ ఉండటాన్ని గమనించాం. రానున్న రోజుల్లో ఇంకా గణనీయంగా కొనసాగగలమని’ టిమ్‌కుక్ అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి నమోదు చేశామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో గత త్రైమాసికం ఐఫోన్ 12, ఐఫోన్ 11 అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, యాపిల్ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధికి ఇవి దోహదపడ్డాయని, ప్రీమియం విభాగంలో టాప్ 5జీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా యాపిల్ అవతరించిందని కంపెనీ వివరించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ దేశీయ మార్కెట్లో 212 శాతం వృద్ధి సాధించింది. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 44 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ వెల్లడించింది.

Tags:    

Similar News