రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ
లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో ‘కరోనా’ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ బారిన పడి ఎంత మంది మరణించారన్న వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కరోనా మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు […]
లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో ‘కరోనా’ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ బారిన పడి ఎంత మంది మరణించారన్న వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.
ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కరోనా మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు ఉంటారు. ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్, ఫోరెన్సిక్ విభాగ ప్రొఫెసర్ సహా ఇతర నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీలో వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు జారీ చేశారు.
Tags: andhra pradesh, ysrcp, ys jagan, perni nani, corona deaths, committee