‘కడప సెటిల్‌మెంట్ గుర్తుకొచ్చింది’

వైజాగ్‌లోని ఆర్ఆర్ వెంకటాపురంలో దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ స్థలంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ పరిశ్రమను వైజాగ్ నుంచి విజయనగరం తరలించేందుకు రంగం సిద్ధం చేశారని ఘాటుగా విమర్శించారు. ప్రమాదం జరిగిన రోజు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ ఎయిర్‌పోర్టులో ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌కు చెందిన వెయ్యి ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు పావులు కదుపుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిని ప్రజలే […]

Update: 2020-05-13 02:50 GMT
‘కడప సెటిల్‌మెంట్ గుర్తుకొచ్చింది’
  • whatsapp icon

వైజాగ్‌లోని ఆర్ఆర్ వెంకటాపురంలో దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ స్థలంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ పరిశ్రమను వైజాగ్ నుంచి విజయనగరం తరలించేందుకు రంగం సిద్ధం చేశారని ఘాటుగా విమర్శించారు. ప్రమాదం జరిగిన రోజు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ ఎయిర్‌పోర్టులో ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌కు చెందిన వెయ్యి ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు పావులు కదుపుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిని ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ స్ధలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పార్కుగా అభివృద్ధి చేయాలని సూచించారు. గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులకు పరిశ్రమ తరపున నష్టపరిహారం ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను ఇస్తానని జగన్ ప్రకటించడంలో అర్థమేంటని అడిగిన ఆయన.. దీనిని చూస్తుంటే కడప సెటిల్ మెంట్ గుర్తొస్తోందని విమర్శించారు. గ్యాస్ లీకేజ్ ఘటన మానవ తప్పిదమని కమిటీలు తేల్చిన నేపథ్యంలో వారిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వమే కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతుందని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు పెంచడం ఏంటని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News