చేతులు ముడుచుకోలే.. తెలంగాణ మంత్రులకు ఏపీ మంత్రి వార్నింగ్

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధికోసం తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. జల వివాదాలపై తామేమి మౌనంగా లేమ‌ని, త‌మ‌ వ్యూహాలు త‌మ‌కు ఉన్నాయ‌న్నారు. సమస్యను మరింత జఠిలం చేయడానికి, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సహకరిస్తామని తెలిపారు. బుధ‌వారం కృష్ణా కరకట్ట […]

Update: 2021-06-30 03:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధికోసం తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. జల వివాదాలపై తామేమి మౌనంగా లేమ‌ని, త‌మ‌ వ్యూహాలు త‌మ‌కు ఉన్నాయ‌న్నారు. సమస్యను మరింత జఠిలం చేయడానికి, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సహకరిస్తామని తెలిపారు. బుధ‌వారం కృష్ణా కరకట్ట విస్తరణ పనులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న బొత్స వైఎస్ఆర్‌పై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారని విమర్శించారు. తమకు అసభ్య పదజాలం తెలుసునని అయితే తెలంగాణ మంత్రుల్లా వాడాల్సిన అవసరం లేదన్నారు. నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని, ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. చట్ట పరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News