సుందరకాండ పారాయణంలో తరించిన సీఎంలు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్ర, కర్ణాటక సీఎంలు వైఎస్ జగన్, బీఎస్ యడ్యూరప్ప గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. తర్వాత […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్ర, కర్ణాటక సీఎంలు వైఎస్ జగన్, బీఎస్ యడ్యూరప్ప గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. తర్వాత నాదనీరాజనం వేదికపై టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.
కర్ణాటక సత్రాల నిర్మాణానికి శంకుస్థాపన
తిరుమలలో కర్ణాటక సత్రాల ప్రాంతంలో రూ.200కోట్లతో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు ముఖ్యమంత్రులు ఇరువురు కలిసి భూమిపూజ చేశారు. కర్ణాటక చారిటీస్‌కు 7.05ఎకరాల భూమిని 50సంవత్సరాల కాల పరిమితికి 2008లో టీటీడీ లీజుకిచ్చింది. ఈ స్థలంలో నిబంధనల మేరకు వసతి సముదాయాల నిర్మాణం చేపట్టేందుకు జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య అంగీకారం కుదిరింది. అంతకుముందు కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ శ్రీమతి రోహిణి సింధూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్తగా నిర్మించే వసతి సమూదాయాల వివరాలను తెలియజేశారు. ఇందులో 242 మంది యాత్రికులకు వసతి గదులు, 32సూట్ రూములు, 12డార్మెటరీలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు ప్రస్తుతం ఉన్న పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టీటీడీ ఈ నిర్మాణాలను పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మురళీకృష్ణ, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, అర్బన్‌ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.