ఏపీ అత్యంత దగా పడిన రాష్ట్రం

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అత్యంత దగాపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రం ఎన్నో దయనీయ పరిస్థితులను చూసిందని ఆయన అన్నారు. ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన హాజరయ్యారు. క్యాంపు ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆయన ఎగుర వేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. అన్ని జిల్లాల మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ […]

Update: 2020-10-31 22:40 GMT

దిశ, వెబ్ డెస్క్:
దేశంలో అత్యంత దగాపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రం ఎన్నో దయనీయ పరిస్థితులను చూసిందని ఆయన అన్నారు. ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన హాజరయ్యారు. క్యాంపు ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆయన ఎగుర వేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. అన్ని జిల్లాల మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు అమరులయ్యారని అన్నారు. నేటికీ 33 శాతం మంది నిర్లక్ష్య రాసులు ఉండటం వెనుకబాటుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రం ఎన్నో దయనీయ పరిస్థితులను చూసిందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డువచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలకు కొందరు అడ్డుపడుతున్నారని అని ఆయన అన్నారు.

Tags:    

Similar News