జగన్ ప్రభుత్వం పై రెచ్చిపోయిన బుద్దా వెంకన్న.. ఏమన్నాడంటే ?
దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. వారి కడుపుకొట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్ముకుని బతికే బడుగు, బలహీన వర్గాల కడుపు కొట్టేందుకే మటన్ మార్టులు, ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పీజీలు, డిగ్రీలు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. వారికి మటన్ దుకాణాల్లో ఉద్యోగాలిస్తున్నారంటూ […]
దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. వారి కడుపుకొట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్ముకుని బతికే బడుగు, బలహీన వర్గాల కడుపు కొట్టేందుకే మటన్ మార్టులు, ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పీజీలు, డిగ్రీలు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. వారికి మటన్ దుకాణాల్లో ఉద్యోగాలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోతున్నారని ఆరోపించారు.
ఇప్పుడు కల్తీ మాంసం, చేపలను అమ్మేందుకే కొత్తగా ఈ మార్టులు, అవుట్‌లెట్‌లు తీసుకువస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సలహాతోనే సీఎం జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఖజనా నింపుకునేందుకు ప్రజలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయారని ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగాన్ని తరిమికొట్టేందుకు కొత్త కంపెనీలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. అంతేకానీ బడుగు, బలహీన వర్గాలు ఉపాధిని దెబ్బతీసేలా మటన్ మార్టులు, ఫిష్ ఆంధ్ర మినీ అవుట్‌లెట్‌లు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.