‘ఈ-వాచ్ యాప్’ ఫర్ లోకల్ వార్.. SEC ఆవిష్కరణ!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ‘‘ఈ- వాచ్’’ పేరిట కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. స్థానిక ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల వేళ ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా, ఈ యాప్ పై […]

Update: 2021-02-03 00:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ‘‘ఈ- వాచ్’’ పేరిట కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. స్థానిక ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

ఎన్నికల వేళ ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా, ఈ యాప్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ఈ యాప్‌లో టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయని, ఈసీగా హ్యాక్‌కు గురయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. దీని వలన కొత్త ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని చెబుతోంది. కాగా, కోర్టు ఏ మేరకు స్పందిస్తుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News