‘కరోనా’ కట్టడికి రూ.200కోట్లు

కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సీఎం జగన్ రూ.200కోట్లు కేటాయించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని సీఎం ప్రజలకు సూచించారు. అసత్య కథనాలు పంపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏపీలోకరోనా అనుమానితులు పెరుగుతున్నా, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని […]

Update: 2020-03-06 21:56 GMT

కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సీఎం జగన్ రూ.200కోట్లు కేటాయించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని సీఎం ప్రజలకు సూచించారు. అసత్య కథనాలు పంపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏపీలోకరోనా అనుమానితులు పెరుగుతున్నా, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. అధికార యంత్రాంగం కూడా అన్నివేళలా అలర్ట్‌గా ఉండి తగు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ సూచించారు.

Tags: ap cm jagan, rs 200 crore for corona virus, don’t spread fake news, police dept take actions

Tags:    

Similar News