ఆ వార్తలు అబద్ధం.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మాస్కు లేకుండా రోడ్లుపైకి వస్తే జరిమానా విధిస్తారంటూ ఏపీ ప్రభుత్వం పేరిట ఉత్తర్వులు వెల్లడైనట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ట్విట్టర్‌లో స్పందించింది. తాము అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. అలాగే లాక్‌డౌన్ విధించనున్నట్లు వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఆలోచన లేదంది. అయితే మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే.. […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మాస్కు లేకుండా రోడ్లుపైకి వస్తే జరిమానా విధిస్తారంటూ ఏపీ ప్రభుత్వం పేరిట ఉత్తర్వులు వెల్లడైనట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ట్విట్టర్‌లో స్పందించింది. తాము అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. అలాగే లాక్‌డౌన్ విధించనున్నట్లు వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఆలోచన లేదంది.
అయితే మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, పట్టణ ప్రాంతాల్లో రూ.వెయ్యి జరిమానా విధిస్తారని సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం నడుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇది నిజమోనని చాలామంది భావించారు.