ఎంసెట్ వెబ్ఆప్షన్లు ప్రారంభం
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల […]
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు.
ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను మంగళవారం విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో చేపట్టనున్నారు. రిజిస్టర్ అయి ఉన్న వారు మొబైల్ నంబరు మార్పు, లాగిన్ ఐడీ తదితర అంశాలపై హెల్ప్‌లైన్ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు ‘HTTPS: //APEAMCET.NIC IN’ను చూడవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసేందుకు కమిషనరేట్‌లో మూడు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటికి ఫోన్‌చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు.