కట్టెలు కొడుతూ.. పేపర్ బాయ్‌గా పని చేసి ఐఏఎస్‌నయ్యా : ఏపీ కలెక్టర్ మనోగతం
దిశ, వెబ్ డెస్క్: చదవాలి.. ఎదగాలి అన్న బర్నింగ్ డిజైర్ ఉంటే ఎవరు కాదు కదా.. ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆపలేవు. ఎంత కష్టమైనా సరే మనం అనుకున్నది సాధిస్తాం. దానికి మనం ప్రణాళిక బద్ధంగా చదవాలి.. సమయాన్ని వృథా చేసుకోవొద్దు.. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చివరికి మనల్ని విజయం వరిస్తది. ఈ మాట వాస్తవం. ఇందుకు ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సరైన ఉదాహరణ. ఈ […]
దిశ, వెబ్ డెస్క్: చదవాలి.. ఎదగాలి అన్న బర్నింగ్ డిజైర్ ఉంటే ఎవరు కాదు కదా.. ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆపలేవు. ఎంత కష్టమైనా సరే మనం అనుకున్నది సాధిస్తాం. దానికి మనం ప్రణాళిక బద్ధంగా చదవాలి.. సమయాన్ని వృథా చేసుకోవొద్దు.. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చివరికి మనల్ని విజయం వరిస్తది. ఈ మాట వాస్తవం. ఇందుకు ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సరైన ఉదాహరణ. ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తన చిన్ననాటి నుంచి కూడా పేదరికం వెంటాడినా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అనుకున్న విధంగా చదువుకుని ఐఏఎస్ ఆఫీసరై ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
ఏపీలోని జీవీఎంసీ కమిషనరర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డా. లక్ష్మీశది కర్ణాటక రాష్ట్రంలోని హోలుగుండనహళ్లి అనే చిన్న కుగ్రామం. అమ్మ లక్ష్మమమ్మ-నాన్న గంగముత్తయ్య కూలి పనులకు వెళ్లేవారు. వారిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. ఒక్కొక్కరోజు తన తల్లిదండ్రులు పస్తులుండాల్సిన పరిస్థితులు చాలా ఉండేవి. అయినా కూడా వారు తమ పిల్లలను చాలా బాగా చూసుకునేవారు. ఈ పరిస్థితులను ఎప్పుడూ గమనించే లక్ష్మీశ చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. ఎప్పుడు కూడా తన తల్లిదండ్రులను, వారి కష్టాన్ని గుర్తు చేసుకునేవాడు. అందుకే ఏ రోజు కూడా కాలాన్ని వృథా చేయకుండా చదువుకుని ఐఏఎస్ ఆఫీసరవ్వగలిగాడు. పదవతరగతి తర్వాత ఇంటర్ చేసే సమయంలో పేపర్ బాయ్ గా పనిచేస్తూ వచ్చిన డబ్బుల్లో కొన్నిటిని ఇంటికి పంపించి మిగతావి తన ఖర్చులకు వాడుకునేవాడు. ఆ తర్వాత త్వరగా బ్యాంకులో జాబ్ సంపాదించొచ్చు అన్న ఆలోచనతో వ్యవసాయ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడంతో ఎమ్మెస్సీ కోసం అలహాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత పీహెచ్ డీ కోసం అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన లక్ష్మీశకు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో సీనియర్ ఫెలోషిప్ వచ్చింది.
కాబోయే భర్తే కదా.. నగ్న ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్.. చివరకు ఏమైందంటే.?
ఆ విధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రయాణం ప్రారంభించిన లక్ష్మీశకు ఒక రోజు తానెందుకు సివిల్స్ రాయకూడదు అన్న ఆలోచన తట్టడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. 2009లో సివిల్స్ పరీక్ష రాశాడు కానీ, ఫలితం రాలేదు. ఆ తర్వాత మళ్లీ 2010 లో రాస్తే ఐఎఫ్ఎస్ కు ఎంపికయ్యాడు. అంతటితో సంతృప్తి చెందక తన ప్రయత్నాన్ని ఆపలేదు. నాలుగో ప్రయత్నంలో అనుకున్న విధంగా విజయం సాధించాడు. 2013లో ఐఏఎస్ గా విజయం సాధించి ఏపీ క్యాడర్ కు ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ గా, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా… ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ప్రయాణం గురించి ఓ సారి గుర్తు చేసుకున్నాడు. తన చిన్నతనంలో పేదరికం కారణంగా తన కుటుంబం ఎన్నో కష్టాలు పడేదని, తాను చదువుకుంటూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని అమ్మ-నాన్నల వెంట కట్టెలు కొట్టేందుకు వెళ్లేవాడినని, అంతేకాదు ఇంటర్ చదువుతున్న సమయంలో పేపర్ బాయ్ గా పనిచేసి ఆ డబ్బులను తన ఖర్చులకు వాడుకుని మిగిలిన డబ్బులను ఇంటికి పంపించేవాడినని తన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసరైనందుకు తనకెంతో ఆనందంగా ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.