YS Jaganmohan Reddy: రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ డబ్బులు జమ

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంలపై ఆధారపడి ఉన్నారని అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందని […]

Update: 2021-05-25 01:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంలపై ఆధారపడి ఉన్నారని అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రకృతి విపత్తులు, చీడపీడలతో దాదాపు 15 లక్షల మందికి పైగా పంటనష్టాపోయారని స్పష్టం చేశారు.

నష్టపోయిన రైతుల ఖాతాల్లోనే నేరుగా పంటల బీమా వెళ్లేలా చేశామన్నారు. 18 వందల 20 కోట్లు ఈ దఫా పంటల బీమా కింద చెల్లిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతబీమా వచ్చిందో, అసలు ఎంత వచ్చిందో లేదో కూడా తెలియదు అని విమర్శించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇచ్చామని గర్వంగా చెబుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు సబ్సిడీ కింద రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, పాడి రైతుల కోసమే అమూల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు. మూడు జిల్లాల్లో అమూల్ కార్యక్రమాలు ప్రారంభయ్యాయని వెల్లడించారు.

Tags:    

Similar News