అమిత్ షాతో ముగిసిన జగన్ సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో పోలవరం సహా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్‌షాకు జగన్‌ విజ్ఞప్తి చేశారు. 2017-18లో పెరిగిన ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని.. రూ. 55,656.87 కోట్లుగా […]

Update: 2021-01-19 12:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో పోలవరం సహా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్‌షాకు జగన్‌ విజ్ఞప్తి చేశారు. 2017-18లో పెరిగిన ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని.. రూ. 55,656.87 కోట్లుగా ఆమోదించాలని సీఎం జగన్ కోరారు. పోలవరం రెండో రివైజ్డ్‌కాస్ట్ ఎస్టిమేట్స్‌కు ఆమోదం తెలపాలన్నారు. పోలవరం భూ సేకరణలో కూడా 55, 335 ఎకరాలు పెరిగిందని అమిత్‌షాకు ఏపీ సీఎం వివరించారు. అంతేకాకుండా.. 2018 డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ. 1,644.23 కోట్ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని అమిత్‌ షాను కోరారు.

Tags:    

Similar News