నూతన పారిశ్రామిక పాలసీతో వారికి అన్యాయం

దిశ, వెబ్‌డెస్క్: నూతనంగా తీసుకొచ్చే పారిశ్రామిక విధానం 2020-23తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గత పారిశ్రామిక విధానంలో ఉన్న రాయితీలను ప్రస్తుతం తగ్గించారని మండిపడ్డారు. సబ్సిడీ శాతం 45 నుంచి 35 కు తగ్గించారని పేర్కొన్నారు. సేవా రంగానికి కూడా పూర్తిగా సబ్సిడీ ఎత్తేశారని, దీంతో కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరిశ్రమలు రానప్పుడు ఉద్యోగ కల్పనకు అవకాశమే లేదని వీర్రాజు […]

Update: 2020-08-25 07:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: నూతనంగా తీసుకొచ్చే పారిశ్రామిక విధానం 2020-23తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గత పారిశ్రామిక విధానంలో ఉన్న రాయితీలను ప్రస్తుతం తగ్గించారని మండిపడ్డారు. సబ్సిడీ శాతం 45 నుంచి 35 కు తగ్గించారని పేర్కొన్నారు. సేవా రంగానికి కూడా పూర్తిగా సబ్సిడీ ఎత్తేశారని, దీంతో కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరిశ్రమలు రానప్పుడు ఉద్యోగ కల్పనకు అవకాశమే లేదని వీర్రాజు అన్నారు.

Tags:    

Similar News