అందుకే టీడీపీకి సీట్లు తగ్గాయి : వీర్రాజు
దిశ, విశాఖపట్నం: రోజుకో మాట.. చెప్పినందువల్లే శాసన సభ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబు పిల్లి మొగ్గలు వేశారన్నారు. పోలవరం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని స్పష్టం […]
దిశ, విశాఖపట్నం: రోజుకో మాట.. చెప్పినందువల్లే శాసన సభ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబు పిల్లి మొగ్గలు వేశారన్నారు. పోలవరం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిపోతుందంటూ చంద్రబాబు, ఆయన అనుచరులు చర్చకు తెరలేపి మభ్యపెడుతున్నారు. కానీ, ప్రాజెక్టు ఎత్తు తగ్గదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కచ్చితంగా నిధులిచ్చి, నిర్మాణం జరిపించి తీరుతుందని వెల్లడించారు. దీంతోపాటు జాతీయ రహదారులు, తాగునీరు వంటి ఎన్నో జాతీయ ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేస్తుందని, రాష్ట్రానికి ఐదేళ్లకు సంబంధించి కేంద్రం రూ.45 వేల కోట్లు ఇస్తోందన్నారు. ఆ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.