ఏలూరులో వింతవ్యాధి.. ఆందోళనలో స్థానికులు

దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏలూరు పరిధిలో మత్స్య పరిశ్రమ, ఉద్యాన పంటల ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో సత్యసాయి స్కీం మంచినీటి పథకం పున: ప్రారంభించాలని కోరారు. 200లకు […]

Update: 2021-10-05 05:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏలూరు పరిధిలో మత్స్య పరిశ్రమ, ఉద్యాన పంటల ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో సత్యసాయి స్కీం మంచినీటి పథకం పున: ప్రారంభించాలని కోరారు. 200లకు పైగా గ్రామాల్లో త్రాగునీరు లేకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

ఏలూరులో వింతవ్యాధి ఘటనపై ఇప్పటివరకూ ప్రభుత్వం నిజాలు వెల్లడించలేదని విమర్శించారు. డ్రైనేజీ, త్రాగునీటి సమస్యపై అపోహలు ఉంటే నివేదికలను ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. వింతవ్యాధి వచ్చి 10 నెలలు అయ్యిందని..ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ రాకపోవడం విచారకరమన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే వింత వ్యాధి వస్తే దానికి కారణాలు కనుగొనడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం విడ్డూరమంటూ విరుచుకుపడ్డారు. వింత వ్యాధిని అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదని సోము వీర్రాజు ఆరోపించారు.

Tags:    

Similar News