ఘనంగా దేవీ శరన్నవరాత్రులు

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదశమి సమీపిస్తుండటంతో అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి’గా ఇవాళ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు అమ్మవారు కనిపించనున్నారు. అయితే, అమ్మవారి దర్శనానికి రోజుకు 10వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. స్లాట్‌ బుక్‌ […]

Update: 2020-10-16 22:04 GMT
ఘనంగా దేవీ శరన్నవరాత్రులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదశమి సమీపిస్తుండటంతో అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి’గా ఇవాళ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు అమ్మవారు కనిపించనున్నారు. అయితే, అమ్మవారి దర్శనానికి రోజుకు 10వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న భక్తులకే అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

అలంపూర్: తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ‘శైలపుత్రిక’ అలంకరణలో జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోవెలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా నేడు ‘ఆదిలక్ష్మి’ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Tags:    

Similar News