అనుపమ ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్…

దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన భామ… మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని హ్యాకర్లపై ఫైర్ అయిపోయింది. ఒరిజినల్ పిక్, మార్ఫింగ్ ఫోటోను పోలుస్తూ స్టేటస్ పెట్టిన అనుపమ .. ఇదంతా ఫేక్ అని తెలిపింది. ఇలాంటి పనులు చేయడానికి బుద్ధిలేదా ? అని కడిగి పారేసింది. ఈ చెత్త పనులను ఇప్పటికైనా ఆపమని హెచ్చరించింది. దయచేసి ఫేక్ […]

Update: 2020-04-10 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన భామ… మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని హ్యాకర్లపై ఫైర్ అయిపోయింది. ఒరిజినల్ పిక్, మార్ఫింగ్ ఫోటోను పోలుస్తూ స్టేటస్ పెట్టిన అనుపమ .. ఇదంతా ఫేక్ అని తెలిపింది. ఇలాంటి పనులు చేయడానికి బుద్ధిలేదా ? అని కడిగి పారేసింది. ఈ చెత్త పనులను ఇప్పటికైనా ఆపమని హెచ్చరించింది. దయచేసి ఫేక్ ఫోటోలను షేర్ చేయొద్దని కోరింది. సెక్యూరిటీ ఇష్యూస్‌తో ఫేస్ బుక్ ఎకౌంట్‌ను డిలీట్ చేస్తున్నట్లు అభిమానులకు తెలిపింది.

మలయాళంలో ‘ప్రేమమ్‌’ తో సినీ రంగ ప్రవేశం చేసిన అనుపమ… తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ‘రాక్షసుడు’ సినిమాలో చివరగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ… నిర్మాత దిల్ రాజు మేనల్లుడు హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేయనుంది.

Tags: Anupama Parameswaran, Facebook, account gets HACKED, film news

Tags:    

Similar News