సీరం నుంచి మరో టీకా.. కొవావాక్స్
ముంబయి: ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారిదారుల్లో ఒకటైన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) శనివారం శుభవార్త అందించింది. భారత్‌లో మరో టీకాను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్‌లోగా వ్యాక్సిన్‌ను ప్రవేశపెడతామని సీరం సీఈవో అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ ఫార్మా కంపెనీతో భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్న టీకా ‘కొవావాక్స్’ కరోనా వైరస్‌ను నియంత్రించడంలో 89.3శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇటీవలే ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాతి […]
ముంబయి: ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారిదారుల్లో ఒకటైన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) శనివారం శుభవార్త అందించింది. భారత్‌లో మరో టీకాను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్‌లోగా వ్యాక్సిన్‌ను ప్రవేశపెడతామని సీరం సీఈవో అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ ఫార్మా కంపెనీతో భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్న టీకా ‘కొవావాక్స్’ కరోనా వైరస్‌ను నియంత్రించడంలో 89.3శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇటీవలే ప్రకటన వచ్చింది.
ఈ ప్రకటన వచ్చిన తర్వాతి రోజే సీరం సీఈవో అదర్ పూనావాలా తాజాగా నోవావాక్స్ గురించి వెల్లడించారు. నోవావాక్స్‌తో తాము కలిసి అభివృద్ధి చేస్తున్న టీకా అద్భుతమైన ఫలితాలనిస్తున్నదని తెలిపారు. భారత్‌లో ఈ టీకా ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో కొవావాక్స్‌ను ప్రేవేశపెట్టాలని భావిస్తున్నట్టు వివరించారు.