కిడ్నాప్ కేసులో మరో ఇద్దరికి పోలీస్ కస్టడీ

దిశ, క్రైమ్ బ్యూరో : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అనేక ట్విస్టులు తెరమీదకొస్తున్నాయి. కిడ్నాప్ కేసులో ఎవరి పాత్ర ఎంతెంత అని మొన్నటి వరకూ సస్పెన్స్ నెలకొనగా.. తాజాగా బెయిల్ పిటీషన్లు, ముందస్తు బెయిల్ పిటీషన్లు చర్చానీయాంశంగా మారుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిల ప్రియ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉండగా, బెయిల్ కోసం ఇప్పటికే ఆమె మూడు సార్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మూడు సార్లు బెయిల్ […]

Update: 2021-01-19 11:14 GMT
కిడ్నాప్ కేసులో మరో ఇద్దరికి పోలీస్ కస్టడీ
  • whatsapp icon

దిశ, క్రైమ్ బ్యూరో : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అనేక ట్విస్టులు తెరమీదకొస్తున్నాయి. కిడ్నాప్ కేసులో ఎవరి పాత్ర ఎంతెంత అని మొన్నటి వరకూ సస్పెన్స్ నెలకొనగా.. తాజాగా బెయిల్ పిటీషన్లు, ముందస్తు బెయిల్ పిటీషన్లు చర్చానీయాంశంగా మారుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిల ప్రియ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉండగా, బెయిల్ కోసం ఇప్పటికే ఆమె మూడు సార్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మూడు సార్లు బెయిల్ రాకపోగా.. జీవిత కాలం శిక్ష విధించే సెక్షన్లు ఉన్నందున నాంపల్లి కోర్టులో దాఖలు చేయాలని సికింద్రాబాద్ కోర్టు సూచించింది. దీంతో అఖిల ప్రియ మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో ఏ2గా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే పిటీషన్ దాఖలు చేయగా, ఈ నెల 21కు విచారణ వాయిదా పడింది. తాజాగా, అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోరుతూ మంగళవారం సికింద్రాబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటీషన్ పై బుధవారం విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇప్పటికే 19 మంది అరెస్టు కాగా, వీరిలో ఏ1గా ఉన్న అఖిల ప్రియను కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీ విచారణను పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కిడ్నాప్ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటనే విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా, ఈ కిడ్నాప్ లో అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ , గుంటూరు శ్రీను పాత్రలతో పాటు వాళ్ల పర్సనల్ అసిస్టెంట్లు (పీఏ) పాత్ర కూడా అంతే కీలకంగా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

దీంతో రెండో దఫాలో అఖిల ప్రియ పీఏ బోయ సంపత్, భార్గవ్ పీఏ మల్లికార్జున్ రెడ్డిలను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై వాదనలు పూర్తయిన అనంతరం బోయ సంపత్, మల్లికార్జున్ రెడ్డిలను మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి శుక్రవారం వరకూ పోలీసులు వీరిరువురిని కస్టడీలో విచారించనున్నారు. వీరిద్దరినీ బుధవారం ఉదయం చంచల్‌ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీ తీసుకోనున్నారు. దీంతో ఈ కిడ్నాప్ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఇంకా ఈ కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్(ఏ2), అఖిల సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుతో పాటు మరో 6 గురు అరెస్టు కావాల్సి ఉంది.

Tags:    

Similar News