తెలంగాణలో మరో రెండు టోల్ ప్లాజాలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ జాతీయ రాహదారిపై స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఒకటి.. వరంగల్ బైపాస్ వద్ద మరొకటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణా పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, సెప్టెంబర్ కల్లా పూర్తవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ( నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 టోల్ ప్లాజాలు ఉండగా.. ఇవి అందుబాటులోకి వస్తే 20కి చేరుకోనున్నాయి. టోల్ ప్లాజాల ద్వారా […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ జాతీయ రాహదారిపై స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఒకటి.. వరంగల్ బైపాస్ వద్ద మరొకటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణా పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, సెప్టెంబర్ కల్లా పూర్తవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ( నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 టోల్ ప్లాజాలు ఉండగా.. ఇవి అందుబాటులోకి వస్తే 20కి చేరుకోనున్నాయి. టోల్ ప్లాజాల ద్వారా నెలకు సాధారణ రోజుల్లో రూ.90 కోట్ల ఆదాయం వచ్చేదని.. లాక్ డౌన్ కారణంగా మే నెలలో రూ.59 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు.