మరో ఇద్దరు కేకేఆర్ ప్లేయర్లకు కరోనా
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత తమ దేశాలకు, స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చెందిన న్యూజీలాండ్ ఆటగాడు సీఫెర్ట్ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఐపీఎల్ వాయిదా పడటంతో టిమ్ సీఫెర్ట్ ఇతర కివీస్ ప్లేయర్లతో కలసి స్వదేశం బయలు దేరడానికి సిద్దపడ్డాడు. మాల్దీవుల మీదుగా వీరంతా స్వదేశానికి పయనం అయ్యారు. అయితే అంతకు ముందు అందరికీ రెండు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత తమ దేశాలకు, స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చెందిన న్యూజీలాండ్ ఆటగాడు సీఫెర్ట్ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఐపీఎల్ వాయిదా పడటంతో టిమ్ సీఫెర్ట్ ఇతర కివీస్ ప్లేయర్లతో కలసి స్వదేశం బయలు దేరడానికి సిద్దపడ్డాడు. మాల్దీవుల మీదుగా వీరంతా స్వదేశానికి పయనం అయ్యారు. అయితే అంతకు ముందు అందరికీ రెండు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. దీంతో సీఫెర్ట్ పాజిటివ్‌గా తేలడంతో అతడిని ప్రస్తుతం ఐసోలేషన్‌కు పంపించారు.
త్వరలోనే సీఫెర్ట్‌ను చెన్నైలో మైక్ హస్సీకి చికిత్స అందించిన ఆసుపత్రికి తరలించనున్నట్లు న్యూజీలాండ్ క్రికెట్ తెలిపింది. కేకేఆర్ జట్టు సీఫెర్ట్‌ను జాగ్రత్తగా చూసుకుంటుందన్న విశ్వాసం ఉన్నదని కివీస్ క్రికెట్ చెప్పింది. మరోవైపు కేకేఆర్ జట్టులోని ప్రసిధ్ కృష్ణ కూడా కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేసిన టెస్టుల్లో అతడికి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో అతడు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేలోపు అతడు కోలుకుంటాడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.