ఈఎస్ఐ స్కామ్.. మరొకరు అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్ఐ స్కామ్ కేసులో మరొక వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కార్తిక్ అనే వ్యక్తి తిరుమల ఏజెన్సీ పేరుతో మందులు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లు సమర్పించడమే కాకుండా.. మరో సంస్థ పేరుతో కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి.. అధిక ధరలకు మందులు చూపి నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఇందులో ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ హస్తం కూడా ఉందని వెల్లడించారు. దీంతో అధికారులు కార్తిక్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో […]

Update: 2020-07-03 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్ఐ స్కామ్ కేసులో మరొక వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కార్తిక్ అనే వ్యక్తి తిరుమల ఏజెన్సీ పేరుతో మందులు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లు సమర్పించడమే కాకుండా.. మరో సంస్థ పేరుతో కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి.. అధిక ధరలకు మందులు చూపి నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఇందులో ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ హస్తం కూడా ఉందని వెల్లడించారు. దీంతో అధికారులు కార్తిక్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అతనికి 16 రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Tags:    

Similar News