వ్యాక్సిన్ అందరికీ అందాలంటే మరో నాలుగేళ్లు..!
దిశ, వెబ్డెస్క్: ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్ అందాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాకు సరిపోయేంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం లేదని ఎస్ఐఐ సీఈవో అదర్ పునావాలా అభిప్రాయపడ్డారు. మీజీల్స టీకాల మాదిరిగా టూ డోస్ ప్రోగ్రాం చేపడితే 15 బిలియన మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్లు అవసరం ఉంటాయని తెలిపారు. మరోవైపు 1.4 బిలియన్ల ప్రజలకు టీకా అందించేందుకు భారత్లో మౌలిక […]
దిశ, వెబ్డెస్క్: ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్ అందాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాకు సరిపోయేంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం లేదని ఎస్ఐఐ సీఈవో అదర్ పునావాలా అభిప్రాయపడ్డారు. మీజీల్స టీకాల మాదిరిగా టూ డోస్ ప్రోగ్రాం చేపడితే 15 బిలియన మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్లు అవసరం ఉంటాయని తెలిపారు. మరోవైపు 1.4 బిలియన్ల ప్రజలకు టీకా అందించేందుకు భారత్లో మౌలిక సదుపాయాలు లేవని పునావాలా అన్నారు.
Read Also…