జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, కుమారుడు అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి కడప జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వీరికి కోర్టు నిన్ననే బెయిల్ మంజూరు చేసింది. విడుదల అయిన 24 గంటల్లోపే వీరిపై మరో కేసు నమోదు అయింది. గురువారం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిలు బెయిల్‌పై కడప జైలు నుంచి విడుదల అయ్యారు. […]

Update: 2020-08-07 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, కుమారుడు అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి కడప జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వీరికి కోర్టు నిన్ననే బెయిల్ మంజూరు చేసింది. విడుదల అయిన 24 గంటల్లోపే వీరిపై మరో కేసు నమోదు అయింది.

గురువారం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిలు బెయిల్‌పై కడప జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురి టీడీపీ కార్యకర్తలు వీరికి స్వాగతం పలికనట్టు సమాచారం. జనం ఒకే చోట గుమిగూడిన నేపథ్యంలో.. కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్‌ రెడ్డిలతో పాటు మరో 31 మందిపై కేసు నమోదు అయింది.

Tags:    

Similar News