మూడు వారాలు అభిషేకాలకి అన్నవరం రాకండి: ఈవో

తిరుపతి వెంకన్నను వదలని కరోనా అన్నవరం సత్య దేవుణ్ణి కూడా తాకింది. దీంతో సత్యదేవుని దేవస్థానం కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిబంధనలు విధించింది. కరోనా వైరస్ నిర్మూలనా చర్యల్లో భాగంగా నేటి నుంచి మరో మూడు వారాల పాటు భక్తులతో కూడిన వ్రతాలు నిత్య పూజా కార్యక్రమాలకు అనుమతించడం లేదని ఆలయ ఈవో వేండ్ర త్రినాధ రావు ప్రకటించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడు వారాలు పాటు రత్నగిరి పై […]

Update: 2020-03-19 07:07 GMT

తిరుపతి వెంకన్నను వదలని కరోనా అన్నవరం సత్య దేవుణ్ణి కూడా తాకింది. దీంతో సత్యదేవుని దేవస్థానం కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిబంధనలు విధించింది. కరోనా వైరస్ నిర్మూలనా చర్యల్లో భాగంగా నేటి నుంచి మరో మూడు వారాల పాటు భక్తులతో కూడిన వ్రతాలు నిత్య పూజా కార్యక్రమాలకు అనుమతించడం లేదని ఆలయ ఈవో వేండ్ర త్రినాధ రావు ప్రకటించారు.

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడు వారాలు పాటు రత్నగిరి పై స్వామివారి వ్రతములు, నిత్య కళ్యాణ ,కేశ ఖండన శాల ను నిలుపుదల చేస్తూనట్లూ, అలాగే భక్తులకు డిజిటల్ ధర్మామీటర్ ద్వారా పరీక్షించిన తరువాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో ఆలయ పరిసరాలు పరిశుభ్రత కోసం అదనపు సిబ్బందితో సోడియం హైపో ఫ్లోరైడ్‌ను స్ప్రే చేస్తున్నామని తెలిపారు.

Tags : annavaram, satyanarayana swami devastanam, satyanarayana swamy temple

Tags:    

Similar News