ఆ మాటలు నన్ను బాధించాయి : అంజలి
దిశ, వెబ్‌డెస్క్: అచ్చ తెలుగమ్మాయి అంజలి… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మన ఇంటి ఆడపిల్లలా ఉందే అనేలా నటించి మెప్పించింది. ఏమో నాకన్నలా తెలిసిపోతాయంతే అంటూ ప్రేక్షకులకు దగ్గరైపోయిన అంజలి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అంతలోనే టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న అంజలి… ఫ్యామిలీ గొడవలతో చాలా బాధపడ్డానని తెలిపింది. సినిమా కెరియర్ విజయవంతంగా సాగుతున్నప్పుడూ కుటుంబంలో గొడవలు జరిగాయని.. ఆ టైంలో మీడియాలో వచ్చిన న్యూస్‌తో చాలా […]
దిశ, వెబ్‌డెస్క్: అచ్చ తెలుగమ్మాయి అంజలి… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మన ఇంటి ఆడపిల్లలా ఉందే అనేలా నటించి మెప్పించింది. ఏమో నాకన్నలా తెలిసిపోతాయంతే అంటూ ప్రేక్షకులకు దగ్గరైపోయిన అంజలి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అంతలోనే టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న అంజలి… ఫ్యామిలీ గొడవలతో చాలా బాధపడ్డానని తెలిపింది.
సినిమా కెరియర్ విజయవంతంగా సాగుతున్నప్పుడూ కుటుంబంలో గొడవలు జరిగాయని.. ఆ టైంలో మీడియాలో వచ్చిన న్యూస్‌తో చాలా మందికి తెలిసిపోయిందని చెప్పింది. ఆ సమయంలో అందరూ కామెంట్ చేయడం సహజమే కానీ… నా అనుకున్నవాళ్లు కూడా వ్యంగ్యంగా మాట్లాడడంతో చాలా బాధగా ఉండేదని చెప్పింది. ఇక నా కెరియర్ ఎండ్ అయినట్లే అని మాట్లాడుకునే వారని తెలిపింది. ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయన్న అంజలి…. అవకాశాల కోసం నేనెప్పుడూ బాధపడలేదని తెలిపింది. కెరియర్‌లో జయాపజయాలు సహజం కానీ… ఇలాంటి మాటలు మనస్సును గాయపరుస్తాయంది.
Tags: Anjali, Nishabdham, Seethamma vakitlo sirimalle chettu