మహేష్‌తో ప్లాన్ చేశా.. కానీ బాలయ్యతో చేస్తున్నా: అనిల్ రావిపూడి

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా టాలీవుడ్ డీలా పడిపోయింది. స్టార్ దర్శకులు ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాది అవుతోంది. దీంతో వారంతా కుదిరినంత త్వరగా ప్రేక్షకుల ముందుకొచ్చి తామేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. వీరిలో అనిల్ రావిపూడి ఒకడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అనిల్ మరో సినిమా విడుదల చేయలేదు. ప్రస్తుతం అనిల్ ఎఫ్3తో బిజీగా ఉన్నాడు.  అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన అనిల్ తన నెక్స్ట్ ఏంటి, మహేష్ సినిమా ఏమైంది అన్న వాటిపై క్లారిటీ ఇచ్చాడు. […]

Update: 2021-11-23 22:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా టాలీవుడ్ డీలా పడిపోయింది. స్టార్ దర్శకులు ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాది అవుతోంది. దీంతో వారంతా కుదిరినంత త్వరగా ప్రేక్షకుల ముందుకొచ్చి తామేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. వీరిలో అనిల్ రావిపూడి ఒకడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అనిల్ మరో సినిమా విడుదల చేయలేదు. ప్రస్తుతం అనిల్ ఎఫ్3తో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన అనిల్ తన నెక్స్ట్ ఏంటి, మహేష్ సినిమా ఏమైంది అన్న వాటిపై క్లారిటీ ఇచ్చాడు.

‘సరిలేరు నీకెవ్వరూ తరువాత మహేష్‌తో ఇంకో సినిమా ప్లాన్ చేశా, కానీ వర్కౌట్ అవుతుందా అన్న అనుమానాలు వచ్చాయి. ఇంతలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు ఎంట్రీ ఇవ్వడంతో ఎఫ్3 సినిమా ఓకే చేశా. ఈ సినిమా తర్వాత మహేష్‌తో చేయాలని ఫిక్స్ అయ్యా. కానీ మహేష్ సర్కారు వారి పాట తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా, ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు, దాంతో నా ప్లాన్ మార్చుకున్నా. అప్పుడే బాలయ్యతో సినిమా ఓకే అయ్యింది. ప్రస్తుతం బాలయ్య సినిమాపై కాన్సంట్రేషన్ పెట్టనున్నా’ అని అనిల్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా అనిల్-బాలయ్య కాంబోలో రానున్న సినిమాలో బాలయ్య నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపిస్తాడని, యాక్షన్ సన్నివేశాలు సైతం అందరినీ మెప్పిస్తాయని అనిల్ చెప్పాడు. కామెడీ టైమింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్ త్వరలోనే రానుందని తెలిపాడు.

Read more: వారి వల్లే నేను ఇలా ఉన్నా.. బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma