‘తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలు వద్దు’
దిశ ఏపీ బ్యూరో: తెలంగాణతో ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవహించే నీటి పంపకాలపై వచ్చిన విభేదాల నేపథ్యంలో అమరావతిలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు గోదావరి నీటిపై ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవన్న ఆయన, దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాయలసీమకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. కృష్ణా, గోదావరి […]
దిశ ఏపీ బ్యూరో: తెలంగాణతో ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవహించే నీటి పంపకాలపై వచ్చిన విభేదాల నేపథ్యంలో అమరావతిలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు గోదావరి నీటిపై ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవన్న ఆయన, దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉందన్నారు.
రాయలసీమకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో న్యాయంగా రావాల్సిన వాటా నీటినే వినియోగించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచుతున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసి తీరుతామని చెప్పారు.
చంద్రబాబు పోలవరం నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని అసమర్ధుడన్న ఆయన, జగన్ పాలనకు మార్కులు వేసేంత సీన్ ఆయనకు లేదని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఏడాది పాలనకే దేశంలో 4వ బెస్ట్ సీఎంగా జగన్ నిలిచారని గుర్తు చేశారు. బాబు ఏనాడైనా టాప్ 5లో నిలిచారా? అని ప్రశ్నిస్తూ, లోకేష్ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్ సినిమా లాంటోడని విమర్శించారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ, బీసీలకు అన్ని రంగాల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.