హయగ్రీవ భూముల కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి బిగ్ రిలీఫ్

హయగ్రీవ భూముల కేసులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది.

Update: 2024-10-17 08:11 GMT

దిశ, వెబ్ డెస్క్: హయగ్రీవ భూముల కేసులో విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బిల్డర్ గద్దె బ్రహ్మాజీ, సీఏ జి. వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అసలేంటీ కేసు

విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో 12.5 ఎకరాల భూమిని 2008లో నాటి ప్రభుత్వం వృద్ధుల కోసం ఇచ్చింది. ఆ భూమిని హయగ్రీవ ప్రాజెక్టుకు కేటాయించింది. 15 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు అడుగు కూడా ముందుకు కదల్లేదు. కట్ చేస్తే.. ప్రభుత్వం తమ ప్రాజెక్టుకు ఇచ్చిన భూమిని వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ఎండీ సీహెచ్ జగదీశ్వరుడు ఇటీవలే సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది సంచలనానికి దారితీసింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీ, మరొకరిపై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంఓయూ పేరుతో పేపర్లపై సంతకాలు తీసుకుని.. తమ విలువైన భూముల్ని కాజేశారని హయగ్రీవ సంస్థ ఆరోపించింది. అయితే.. తమపై నమోదు చేసిన కేసులో వాస్తవం లేదని, దానిని కొట్టివేయాలని కోరుతూ ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఇది సివిల్ కేసు అని, క్రిమినల్ కేసుగా మార్చలేమని కోర్టు తేల్చి చెప్పింది. కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉండటంతో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని జూన్ లో చెప్పింది. అప్పటి నుంచి కేసు వాయిదాలు పడుతూ వచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమన్న కోర్టు.. కావాలంటే ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోవచ్చని సూచించింది. తాజాగా ఈ కేసులో ఎంవీవీకి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.          


Similar News