నాలుగేళ్లు జగన్ జనరంజక పాలన: విజయసాయిరెడ్డి

నవ్యాంధ్ర ప్రదేశ్‌‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరంజక పాలన అందిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు..

Update: 2023-05-29 16:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: నవ్యాంధ్ర ప్రదేశ్‌‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరంజక పాలన అందిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్ పాలన ప్రారంభించి నేటికి నాలుగు ఏళ్లు పూర్తయిందని ఆయన చెప్పారు. సీఎం జగన్‌ నాయకత్వంలో సుపరిపాలన కొనసాగుతోందన్నారు. ఏపీ ప్రజలు గతంలో చూడని ప్రభుత్వ జన సంక్షేమ పథకాలను,  ప్రగతిని స్వయంగా చూశారని విజయసాయిరెడ్డి చెప్పారు.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌‌లో 2004–2009 మధ్య జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మాత్రమే రాష్ట్ర సర్కారు ఇలాంటి ప్రజాసంక్షేమాన్ని అమలు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. 2014–2019 మధ్యకాలంలో కుదేలైన ఏపీ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి సీఎంగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే జగన్‌ ప్రజాసేవకు అంకితమయ్యారని చెప్పారు. ప్రమాణ స్వీకార వేదికపైనే వృద్ధ్యాప్య పింఛన్లు పెంచుతూ ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. అలా మొదలైన పరిపాలనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారు  ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News