YS Sharmila:‘బుడమేరు వరదకు వారిద్దరు కారణమే’..వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!

ఏపీలో ఇంతకాలం వైఎస్ జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం చంద్రబాబు పాలన పై విరుచుకుపడుతున్నారు.

Update: 2024-09-11 09:32 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇంతకాలం వైఎస్ జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం చంద్రబాబు పాలన పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదల్లో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. చిన్నారుల విరాళం కాదు కేంద్రాన్ని నిలదీసి సహాయం పొందాలని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వరదలు వచ్చినా రూపాయి సహాయం కూడా చేయలేదని ఫైరయ్యారు. విజయవాడలో వరదలకు తీవ్రంగా ప్రభావితమైన పాత రాజరాజేశ్వరి పేటలో నిన్న(మంగళవారం) వైఎస్‌ షర్మిల పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..వైఎస్‌ షర్మిల గత సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ప్రస్తుత సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

'బుడమేరు వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత బుడమేరును పట్టించుకున్న వాళ్లు లేరు. బుడమేరు వరదకు చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ కారణమే' అని షర్మిల సంచలన ప్రకటన చేశారు. బుడమేరు బీభత్సం అంతా ఇంతా కాదు బుడమేరు తీరని శోకాన్ని మిగిల్చింది. గత రెండు వారాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలకు ఇప్పటి వరకు 50 మంది చనిపోవడం దారుణం, దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. విజయవాడ మన రాజధాని నగరం ఇంతా నష్టం జరిగితే పాలకులు ఎలా నిద్ర పోతున్నారు. వరదలకు 6800 కోట్లు నష్టం జరిగిందని బాబు చెప్పాడు ఆయన చెప్పిన నష్టం వరకు అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

వస్తున్నారు..నష్టం అంచనా అంటున్నారు రూపాయి మాత్రం కేంద్రం నుంచి రాలేదని అన్నారు. బీహార్‌లో రోడ్లకోసం అని 10 వేల కోట్లు ఇచ్చారు. మరి ఆంధ్ర మీద కేంద్రానికి ఎందుకు సవతి తల్లి ప్రేమ? అని షర్మిలా ప్రశ్నించారు. ఇంతా నష్టం జరిగితే మోడీ కనీసం రాలేదు ఆయన దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు ఆంధ్ర ఎంపీలతో మోడీ అధికారం అనుభవిస్తున్నాడు. ఇలాంటి విపత్తులో మోడీ కనీసం స్పందన లేదు. బీజేపీ చేసిన మోసం పై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రం నుంచి కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు గుక్కెడు నీళ్ళు అందక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో రోడ్లపై పడ్డారు. రేషన్ బియ్యం ఇస్తున్నారు కానీ అవి దొడ్డు బియ్యం అంట ట్యాంకర్‌తో నీళ్ళు ఇస్తున్నారు కానీ అవి కాలనీలకు చేరడం లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. నేను స్వయంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశా అని చెప్పుకొచ్చారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వమని అడిగా విశాఖ వేదికగా రైల్ నీరు తయారవుతుంది, విజయవాడకి రైల్ నీర్ ఇవ్వాలని అడిగాను అని వైఎస్ షర్మిలా పేర్కొన్నారు.


Similar News