YS Sharmila:సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన పై వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-20 11:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కావడంతో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన 100 రోజుల పాలన గురించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 100 రోజుల పాలనలో శిశుపాలుడి లెక్కల మాదిరి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తప్పులను, అవినీతిని శ్వేతపత్రాల మాదిరి చూపించారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajashekar Reddy) పేరును ఎక్కడ వీలుంటే అక్కడ తొలగించారని, వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హామీల విషయంలో చంద్రబాబు ఏం చేశారని అడిగినా, కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం చేసింది అని అడిగినా.. నూటికి 'సున్నా' అనే చెప్పాలని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ ను ఇంకా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పారని.. ఇంతవరకు ఆ దిశగా పెద్దగా సాధించిందేమీ లేదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.


Similar News