ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిల

పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi )ని ఏపీ పీసీసీ చీఫ్(AP PCC chief) వైఎస్ షర్మిల(YS Sharmila) మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2025-01-15 15:07 GMT
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిల
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi )ని ఏపీ పీసీసీ చీఫ్(AP PCC chief) వైఎస్ షర్మిల(YS Sharmila) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె.. కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తో పాటు ఇతర అంశాలపై చర్చించి నట్లు ట్వీట్ చేశారు. అంతకు ముందు ఢిల్లీలోనే ఉన్న ఆమె ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోహన్ భగవత్(Mohan Bhagwat) టెర్రరిస్టులా మాట్లాడుతున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.


Similar News