AP:నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన వైఎస్ షర్మిల.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలేరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.

Update: 2024-09-12 11:28 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలేరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఏలేరు వరద రైతులను నిండా ముంచింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగి తీవ్ర నష్టం జరిగింది. నేడు(గురువారం) పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..ఈ పరిస్థితులకు కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్టలేదు. మరమత్తులు లేక రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరద పాలు అయింది ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టారు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు జగన్ తప్పిదమే అంటున్నాడు, వైఎస్ జగన్ ఎమో బాబు తప్పిదం అంటున్నారు..అని అసలు ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణ పై ఇద్దరికీ పట్టింపు లేదు జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారని విమర్శించారు. తట్టెడు మట్టి కూడా తీయలేదు డ్యామ్‌లు కొట్టుకు పోతున్నా జగన్‌కి పట్టింపు లేదు. నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలు నష్టం అని గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తా అన్నాడు..10 వేలు ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటన చేయాలని షర్మిల అన్నారు. జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశాడని, జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చేయొద్దని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.


Similar News