వైఎస్ జగన్ పతనం మెుదలైంది : మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ కేసులో నిర్దోషిగా బయటకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ కేసులో నిర్దోషిగా బయటకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నేతలు కళ్లుండి చూడలేని కబోదులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు మాతో రండి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు.. ఎలా పని చేస్తున్నాయో చూపిస్తాం అని చాలెంజ్ చేశారు. మాతో వచ్చే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? అని గంటా శ్రీనివాసరావు నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ను మెచ్చుకుంటూ.. ఏయూ వీసీ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు అని గుర్తు చేశారు. డిజైన్ టెక్ ఎండీ ప్రతి పైసాకు లెక్క చూపిస్తామని అన్నారు. చంద్రబాబుపై కక్షలో భాగమేనని ప్రజలు గ్రహించారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పతనం మొదలయ్యిందనేదానికి అనేక సంకేతాలు వస్తున్నాయి అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.