YS Jagan: మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం పక్కా.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్‌సీపీ (YSRCP) అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు.

Update: 2025-03-12 04:38 GMT
YS Jagan: మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం పక్కా.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్‌సీపీ (YSRCP) అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. ఇవాళ మంగళగిరి (Mangalagiri)లోని తాడేపల్లి (Thadepally) పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముందుకు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajashekar Reddy) విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. లేకపోయినా తమ పార్టీ నిరుపేదల పక్షాల నిలబడుతోందని అన్నారు.

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. తమకు ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్తేమి కాదని కామెంట్ చేశారు. మరో నాలుగేళ్లు గడిస్తే.. అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌ (YSR) ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. వైసీపీ (YCP) అవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని కలెక్టరేట్ల (Collectorate) వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement), వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలు, నిరుగ్యోగ భృతి (Unemployment Allowance) హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలు, నాయకులకు జగన్ పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News