YS Jagan: ఆర్గనైజ్డ్ క్రిమినల్‌గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.. వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మభ్యపెట్టేందుకేనని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-13 11:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మభ్యపెట్టేందుకేనని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారని కామెంట్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇక 4 నెలలు మాత్రమే ఉందని ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయనే ఇంతకాలం బడ్జెట్ పెట్టలేదని ఆరోపించారు. సాకులు చెబుతూ బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాటలు డ్రామా అని బడ్జెట్‌లోనే తెలిసిందని ఎద్దేవా చేశారు.

ఆర్గనైజ్డ్ క్రిమినల్‌గా చంద్రబాబు (Chandrababu) వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. వాళ్లు చెప్పే అబద్ధాలు కూడా అంతర్జాతీయ అంశంగా ప్రచారం చేస్తారని అన్నారు. రాష్ట్రం శ్రీలంక (Srilanka)లా మారిందని ముందు చంద్రబాబు మాట్లాడతారని.. ఆ తరువాత పవన్ (Pavan), పురందేశ్వరి (Purandeshwari) కలిసి బాబుకి వత్తాసు పలుకుతారని ధ్వజమెత్తారు. ఓ పద్థతి ప్రకారం తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. పరిమితికి మించి వైసీపీ ప్రభుత్వం (YCP Government) అప్పులు చేసిందంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు.  

Tags:    

Similar News