YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. వైఎస్ భాస్కర్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-11-29 08:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌‌ రెడ్డి (YS Bhaskar Reddy)కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ.. సీబీఐ (CBI) సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై సీజేఐ సంజీవ్ ఖన్నా (CJI Sanjeev Khanna) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదా వేసింది.

విచారణలో భాగంగా హైకోర్టు (High Court)లో మందు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన జడ్జి.. మళ్లీ బెయిల్ మంజూరు చేశారని సీబీఐ (CBI) తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఇదే కేసులో కీలక నిందితులుగా ఉన్న వారి బెయిల్ పిటిషన్లు (Bail Petitions) అన్ని రద్దు అయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. ఈ క్రమంలోనే సీజేఐ సంజీవ్ ఖన్నా (CJI Sanjeev Khanna) .. వివేకా హత్యకేసులో ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో సహా.. భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ.. కేసు విచారణను మార్చి నెలకు వాయిదా వేశారు. 

Tags:    

Similar News