మాది పావలా పార్టీ కాదు.. జనసేనపై వైవీ సుబ్బారెడ్డి విమర్శలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత వైసీపీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2023-11-25 13:40 GMT
మాది పావలా పార్టీ కాదు.. జనసేనపై వైవీ సుబ్బారెడ్డి విమర్శలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులను శుక్రవారం పరామర్శించిన పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వానికి నాలుగు నెలలే సమయం ఉందని, ఆ తర్వాత ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ వేపగుంటలో చేపట్టిన వైసీపీ సామాజిక సాధాకారిత బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన జనసేన పార్టీలా తమది పావలా పార్టీ కాదని విమర్శించారు. అధికారంలోకి వచ్చినట్లు పవన్ కలలుకంటున్నారని, ఆయన ఫస్ట్ రాష్ట్రంలో ఉండాలని ఎద్దేవా చేశారు. అప్పుడే రాష్ట్రంలో పగలు ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. ఆ తర్వాత రాత్రి పూట కలలు కనొచ్చని సలహా ఇచ్చారు. షూటింగ్ ఖాళీ సమయంలో రాష్ట్రానికి వచ్చి పవన్ రాజకీయాలు చేస్తారని,.కానీ వైసీపీ మాత్రం ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడుతోందని తెలిపారు. అలాంటిది పవన్ పార్టీతో వైసీపీకి పోలికేంటని ప్రశ్నించారు. రాజకీయపరంగా ఎవరు ఎక్కడి నుంచైనా పని చేయవచ్చన్నారు. తెలంగాణలో పవన్ ఎవరి కోసం ప్రచారం చేస్తున్నారో గమనించాలన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు కోసం రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ జగనే సీఎంగా ఉంటారని వైసీపీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News