Breaking: ఏపీ ఎన్నికలపై కీలక ప్రకటన

ఏపీ ఎన్నికలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు...

Update: 2024-02-28 12:10 GMT
Breaking: ఏపీ ఎన్నికలపై కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికల సంఘం నిర్వహించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు మార్చి 13న, లేదా 14న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విజయరెడ్డి పేర్కొన్నారు. జగన్ సిద్ధం సభలకు జనాల స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ వైసీపీ అభ్యర్థులకు సంబంధించి 7 జాబితాలు విడుదల చేశామని, ఇక మొత్తం సీట్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.


అతి త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగానే ఇది కూడా జనాకర్షకంగా ఉంటుందని తెలిపారు. మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం నిర్వహిస్తున్నానమని, ఆ సభకు 15 లక్షల మంది వస్తారని తాము అంచనా వేస్తున్నామని విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read More..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్‌లు 

Tags:    

Similar News