అసలు పోలికే లేదు..వాళ్ళు అన్నదమ్ములేందిరా బై.. పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నిన్న పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రౌడీ అని అతన్ని భీమవరం నుండి తరిమికొట్టాలని మాట్లాడారు.

Update: 2024-03-13 08:22 GMT

దిశ వెబ్ డెస్క్: నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రౌడీ అని అతన్ని భీమవరం నుండి తరిమికొట్టాలని మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలపై స్పందించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేదని పేర్కొన్నారు.

పవన్ ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని సూచించారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని మండిపడ్డారు. తాను లోకల్ అని.. స్థానికంగా ఉన్న తనను తరిమికొట్టాలి అనడం అవివేకంగా కాదా.. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందా అని ఎద్దేవ చేశారు. అలానే తనకు తన పేరు పై భీమవరంలో 9 ఎకరాల భూమి ఉందని.. ఎకరం కావాలో రెండు ఎకరాలు కావాలో పవన్ అడిగితే అమ్ముతాను అని తెలిపారు.

ఇక గతంలో పవన్ పక్కనే ఉన్న కాపు నేతలు ఇప్పుడు పవన్ ని ఎందుకు దూరం పెడుతున్నారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అలానే చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు అసలు పోలికే లేదని.. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారని చిరంజీవిని కొనియాడారు. ఇక తాను రౌడీ ఎమ్మెల్యే అయితే తనపై ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా? అని ప్రశ్నించారు.

అలానే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పులపర్తి రామాంజనేయులు, ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు వహించిన కొటికలపూడి గోవిందరావు భీమవరం కంపోస్ట్ యార్డు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు? అని ప్రశించారు.  కంపోస్ట్ యార్డుకు తాను ఆరు ఎకరాల భూమిని సేకరించానని వెల్లడించారు.

అలాంటి తనను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తరిమితే పారిపోయేవాడిని కాదాని, తమ బ్లడ్ లోనే ప్రజా సేవ ఉంది పేర్కొన్నారు. 2019లో భీమవరం నియోజకవర్గంలో ప్రజలే పవన్ కళ్యాణ్ ని తరిమికొట్టారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవ చేశారు. 

Read More..

ఆ పార్టీ కోసం పవన్ కల్యాణ్ మరో త్యాగం..ఎన్ని సీట్లు వదులుకున్నారంటే?  

Tags:    

Similar News