కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే.. రఘువీరారెడ్డితో భేటీ

వైసీపీ మార్పులు చేర్పుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది.

Update: 2024-01-10 07:58 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీ మార్పులు చేర్పుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ల స్థానాలను మార్చగా.. మరి కొంతమంది సిట్టింగులకు సీటు కూడా ఇవ్వలేదు. వైసీపీ అధిష్టానం ఆచరిస్తున్న మార్పులు చేర్పుల పైన వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత అధికార ధోరణికి పలువురు నేతలు పార్టీకి బైబై చెప్పి వేరే పార్టీ గూటికి చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నుండి బయటకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈయన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలానే గతంలో రాయదుర్గం , కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుండి బరిలో ఉంటామని కాపు రామచంద్రారెడ్డి అర్ధాంగి భారతి ప్రకటించిన విషయం సుపరిచితమే.. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తురు అనే చర్చ నెలకొంది. కాగా నిన్న మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డినితో రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిరువురు రెండు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు.అయితే మడకశిర మండలం నీలకంఠాపురం లోని రఘువీరా నివాసానికి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, కోడలు అలేఖ్యతో కలిసి వచ్చారు. దీనితో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే వార్త చక్కెర్లు కొడుతోంది. ఈ రోజు రాయదుర్గంలో కాపు నివాసంలో రామచంద్రారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై స్పష్టత ఇవ్వనున్నారు.

Tags:    

Similar News