మహిళల సభలో చంద్రబాబు ఆ టాపిక్ మాట్లాడటం దారుణం: MLA శిల్పారవి

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం కుప్పంలో మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. జగన్ సర్కార్ కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల

Update: 2024-03-25 14:41 GMT
మహిళల సభలో చంద్రబాబు ఆ టాపిక్ మాట్లాడటం దారుణం: MLA శిల్పారవి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం కుప్పంలో మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. జగన్ సర్కార్ కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తున్నారని.. టీడీపీ అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే, మహిళల సభలో చంద్రబాబు మద్యం గురించి మాట్లాడటంపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి ఫైర్ అయ్యారు. నంద్యాలో ఇవాళ ఆయన మీడియతో మాట్లాడుతూ.. అధికారం కోసం రోజురోజుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన మద్యం అందిస్తామని బాబు మహిళలతో చెప్పడం హాస్యాస్పదమన్నారు. తక్కువ ధరకు కాదు.. చంద్రబాబుకు చేతనైతే మద్యపాన నిషేదం అమలు చేయాలని సవాల్ విసిరారు. మహిళల సభలో చంద్రబాబు మద్యం గురించి మాట్లాడటం దిగజారుడు చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read More..

వైసీపీ కోసమే వాలంటీర్లు పని చేస్తారు.... ఏం చేస్తారో చేసుకోండి...!  

Tags:    

Similar News