Vijayawada: వైసీపీ నిరసన.. ఉద్రిక్తత
రైతు సమస్యలపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: రైతు సమస్యలపై వైసీపీ(Ycp) నేడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(YCP President Devineni Avinash)ను నడిరోడ్డుపై అరెస్ట్ చేశారు. అవినాష్‌తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో కూడా సమాధానం చెప్పడంలేదని మండిపడ్డారు. ఇక నడిరోడ్డుపైనే తనను అదుపులోకి తీసుకోవడాన్ని అవినాష్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవన్నారు. రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ అవినాష్ ప్రశ్నించారు.