నారా లోకేశ్‌పై మరోసారి అభ్యర్ధిని మార్చిన వైసీపీ

టీడీపీ అధినేత నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి ఇన్ చార్జిని మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

Update: 2024-03-01 16:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తొంది. దీనికై నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేస్తూ.. వడివడిగా అడుగులు వేస్తొంది. ఈ నేపధ్యంలోనే వైసీపీ తొమ్మిదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో టీడీపీ అధినేత నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి ఇన్ చార్జిని మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నారా లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయినా.. నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ.. క్యాడర్ ని పటిష్టపరుచుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ.. నిత్యం అధికార పార్టీని ఎండగడుతున్నాడు. అంతేగాక టీడీపీకి వారసుడనే ట్యాగ్ లైన్, గత ఎన్నికల్లో ఓడిపోయాడనే సింపతీ, అధికారంలోకి వస్తే కీలక మంత్రి పదవి దక్కే అవకాశం ఉండటంతో.. నియోజకవర్గ ప్రజలు లోకేశ్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.దీంతో నారా లోకేశ్ ని ఢీ కొట్టేందుకు వైసీపీ అధిష్టానం రెండు సార్లు ఇన్ చార్జిలను మార్చాల్సి వచ్చింది.

2019 లో లోకేశ్ పై వైసీపీ నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని మారుస్తూ.. బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ చార్జిగా నియమించింది.దీంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నారా లోకేశ్ ని ఢీ కొట్టే శక్తి గంజికి లేదని భావించిన వైసీపీ మరోసారి ఇన్ చార్జిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సారి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు మారుగుడు లావణ్య పేరును ప్రకటించింది. ఇవ్వాళ మంగళగిరి వైసీపీ నేతలైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో సీఎం కార్యాలయంలో చర్చలు జరిపిన వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.ఇక అదే జాబితాలో నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా విజయసాయిరెడ్డి పేరును, కర్నూలు వైసీపీ ఇన్ చార్జిగా రిటైర్ట్ ఐఏఎస్ ఇంతియాజ్ పేర్లను వైసీపీ ప్రకటించింది.

తొలి జాబితాలో గంజి చిరంజీవి, 9వ లిస్టులో మురుగుడు లావణ్య

Tags:    

Similar News